కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో మ‌రో వికెట్ ప‌డిపోయింది. నిన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌గా, తాజాగా ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు దాసోజు శ్ర‌వ‌ణ్ ప్ర‌క‌టించారు. మ‌రికాసేప‌ట్లో మీడియా ఎదుట అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌ట్లేద‌నే బాధ‌తో శ్ర‌వ‌ణ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి ఆయ‌న గాంధీ భ‌వ‌న్‌కు దూరంగా ఉంటున్నారు. త‌న‌ను సంప్ర‌దించ‌కుండానే రేవంత్ రెడ్డి ఏక‌ప‌క్షంగా పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవ‌డం కూడా శ్ర‌వ‌ణ్‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్లు స‌మాచారం.