దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు – మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 18 వేల మంది తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గురువారం సమాచారభవన్ లోని బోర్డు రూమ్ లో అక్రెడిటేషన్​ కమిటీ మూడో మీటింగ్​ జరిగింది. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన కమిటీ 600 మందికి కార్డులు ఇవ్వడానికి గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ ఫస్ట్​ టైం ఆన్ లైన్ విధానంలో పూర్తి పారదర్శకంగా అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. సమాచార శాఖ అదనపు సంచాలకుడు నాగయ్య, మీడియా అకాడమీ కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, అసిస్టెంట్ డైరెక్టర్ హష్మి, కమిటీ సభ్యులు విరాహత్ అలీ, బసవ పున్నయ్య, కట్టా కవిత, సౌమ్య, వి.సతీశ్‌, కోటిరెడ్డి, ప్రకాశ్, గంగాధర్, ఆర్టీసీ పీఆర్వో కిరణ్ కుమార్ రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.