- పరిశ్రమ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు
గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుందని పరిశ్రమ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, జనరల్ మేనేజర్ నాగమ ల్లేశ్వరరావును అన్నారు. శుక్రవారం పాలకవీడు మండలంలోని రావి పహాడ్ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో 750 మీటర్లు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. డెక్కన్ సిమెంట్ పరిశ్రమ చేస్తున్న సేవలను గ్రామస్తులు చూసి అభినందించారు. ఈ కార్యక్రమాలంలో సర్పంచ్ నంభూరి కృష్ణా రెడ్డి, జీఎం మస్తాన్, మెకానికల్ శ్రీనివాస్ రావ్, శ్రీనాథ్, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.