బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా అశోక్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటి నిర్మాణ అనుమతి కోసం సరూర్‌నగర్‌కు చెందిన ఏ దేవేందర్ రెడ్డి అశోక్‌ను సంప్రదించాడు. మధ్యవర్తి శ్రీనివాస్ రాజు(ప్రయివేటు ఆర్కిటెక్చర్) ద్వారా అశోక్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఇవాళ అశోక్ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అశోక్‌తో పాటు శ్రీనివాస్ రాజును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంతో పాటు అశోక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు.
అయితే అశోక్ బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్‌గా గుర్తింపు పొందారు. ఆయన పెళ్లి డ్యాన్స్ బుల్లెట్ బండి సాంగ్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 2021, ఆగస్టు 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయను రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. అప్పగింతల సమయంలో వధువు చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, గత రెండు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 3.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. బాగా హిట్ అయిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని గాయని మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’ పాటకు కట్టుకున్న భర్త ముందు ఆడి కొత్త జీవితంలోకి భర్తను మనసారా ఆహ్వానించింది. పాటలోని పదాలకు అనుగుణంగా స్టెప్పులేస్తూ నూతన వరుడిని ఆకట్టుకుంది.