అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్‌లోని మోరెనా (Morena) జిల్లా బన్మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా  (Illegal fiirecrackers) తయారుచేస్తున్న ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు శిథికాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనను చంబల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజేష్ చావ్లా  ధ్రువీకరించారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ప్రభుత్వ అధికారులు జేసీబీతో సహా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో దీపావళి బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తం దెబ్బతింది.