హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ డీఎస్పీ (ACB DSP) శ్రీనివాస్ బృందం గురువారం సోదాలు నిర్వహించింది. హయత్‌నగర్‌లోని వినాయక నగర్లో ఉన్న పలని ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో పలని బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు(ACB officers) సోదాలు చేస్తున్నారు. గతంలో అబ్దుల్లాపూర్‌మెట్టు, నల్లగొండ లో సబ్ రిజిస్ట్రారుగా పలని పనిచేశారు. ఈరోజు సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు కొనసాగనున్నాయి.
