పీఎస్‌డీఏ సభ్యుడిగా వీ ప్రకాశ్‌

పాలంపేట స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎస్‌డీఏ) సభ్యుడిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌, పాలంపేట వాసి వీరమల్ల ప్రకాశ్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా.. సంస్థ నిబంధనల ప్రకారం రామప్పను అభివృద్ధి చేసేందుకు ములుగు కలెక్టర్‌ చైర్మన్‌గా ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఏర్పాటు చేసిన పీఎస్‌డీఏ కమిటీలో ప్రకాశ్‌ను సభ్యుడిగా నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.