కొండమడుగు ఇండస్ట్రీ ఏరియాలో ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కొండమడుగు పరిసరాల్లో పాత మిషనరీ ద్వారా నడుస్తున్న రసాయన పరిశ్రమలు వెంటనే తొలగించాలన్నారు. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ కొండమడుగు పక్కనే ఉందన్నారు. కొండమడుగు ఇండస్ట్రీయల్ జోన్ నుంచి తొలగించి రెసిడెన్షియల్ జోన్‌గా చేయాలని డిమాండ్ చేశారు. కొండమడుగులో ఉన్న రసాయన పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 కోట్లు కట్టకపోవడంతో రాయగిరికి వచ్చే ఎంఎంటిఎస్ ఆగిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
