జల, వాయు కాలుష్యానికి కారకమైన కెమికల్ కంపెనీల శాశ్వత మూసివేతకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీ నగర్ మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని గ్రామస్థులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆందోళన నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు ప్రమాదకారిగా మారిన పరిశ్రమలను పూర్తిగా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులకు సూచించినట్లు తెలిపారు. కొండమడుగు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌లోకి మార్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ సుధాకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు గోళి పింగల్‌రెడ్డి రాచమల్ల శ్రీనివాస్, వైస్‌ఎంపీపీ గణే్‌షరెడ్డి, మల్లగారి శ్రీనివాస్ ఉన్నారు.
