సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలో ఆయన నివాసం విజయకృష్ణ నిలయం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.సోమవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకురాగలిగినా ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు.
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. కార్డియాక్ అరెస్టుతో సోమవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత అక్కడి నానక్‌రామ్‌గూడలోని తన నివాసమైన విజయకృష్ణ నిలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిన్న కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా చిత్రపరిశ్రమ ఇవాళ తన కార్యకలాపాలను చేసుకుంది.