గనుల భద్రత విభాగాల్లో సాగర్ సిమెంట్స్ మొదటి బహుమతి అందుకుంది. గనుల భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకు న్నట్లు పరిశ్రమ వైస్‌ప్రెసిడెంట్(మైన్స) బీఎ్‌సపీ రాజు, వీవీ కృష్ణారెడ్డి(ఏజీఎం-మైన్స) తెలిపారు. నవంబరు 7 నుంచి 12 వరకు సాగర్ సిమెంట్‌ను తనిఖీ చేసిన అధికారులు లైమ్‌స్టోన-1లో 9 విభాగాలకు 4 విభాగాల్లో మంచి ప్రదర్శనను గుర్తించి మొదటి బహుమతి, మైన్స-2లో 9 విభాగాలకు 7 విభాగాల్లో సరైన పద్ధతిని గుర్తించి ద్వితీయ బహుమతిని, అన్ని విభాగాలను కలిపి మొదటి బహుమతి అందుకున్నట్లు వారు తెలిపారు. ఈ అవార్డులను డైరెక్టర్ జనరల్ మైన్స సేఫ్టీ అధికారులతో అందజేశారన్నారు.
