అనధికారిక అగ్రిమెంట్లు.. రూ. కోట్లలో డీల్

రసాయన వ్యర్థాల తరలింపులో మాఫియా

పరిశ్రమల రసాయన వ్యర్ధాల తరలింపు, పారబోత ప్రక్రియ మాఫియా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ కనుసన్నల్లో సాగుతోంది. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, కాటేదాన్ పారిశ్రామిక వాడల్లో ఈ మాఫియాకు చెందిన ప్రతినిధులు.. పరిశ్రమల యజమానులతో రూ.కోట్లలో డీల్ కుదుర్చుకుంటున్నారు. మూడు పారిశ్రామిక వాడల్లోని కొన్ని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు మాఫియా ముఠాలకు నెలకు రూ.5-10 కోట్ల వరకూ ఇస్తున్నట్లు సమాచారం. పరిశ్రమల శాఖ, పోలీస్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లోని కొందరు అధికారులతో అనధికారిక ఒప్పందాలు చేసుకొని.. వారు తమ కంపెనీల వైపు చూడకుండా సంతృప్తి పరుస్తున్నారు. జీడిమెట్లలోని పారిశ్రామికవాడలో పీసీబీ సిబ్బందిపై దాడి వెనుక ఈ మాఫియా ఉన్నట్లు సమాచారం.

* జీడిమెట్ల, కాటేదాన్, ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల ప్రమాదకర రసాయన వ్యర్ధాలు నేరుగా నాలాలు, చెరువులు, భూగర్భంలోకి వెళ్లడం వెనుక పరిశ్రమల ప్రతినిధులు, అధికారులకు, మధ్య ఒప్పందాలున్నాయి.

* డ్రమ్ము రసాయనాల వ్యర్ధాలు శుద్ధి చేసేందుకు రూ.10 వేలు ఖర్చయితే.. శుద్ధి చేయకుండా నాలాలు, చెరువుల్లో కలిపేందుకు రూ.2 వేలు ఇస్తే సరిపోతోంది. (సోర్స్: ఈనాడు)