కాటన్ జిన్నింగ్ మిల్లులో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేసి మిల్లును సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మారెపల్లి గ్రామ శివారులో గల సాయిబాబా ఆగ్రోస్ పత్తి మిల్లు(జిన్నింగ్)లో తూకం వేసే కాంటాలో తేడాలున్నాయనే ఫిర్యాదు మేరకు తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్రెడ్డి, ఇన్స్పెక్టర్ అశోక్‌రావులు సోదాలు నిర్వహించారు. ఈమేరకు 35 టన్నుల పత్తిని తూకం వేయగా.. సుమారు 15 కిలోలు తేడా రావడంతో మిల్లును సీజ్ చేసి కేసు మోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ అశోక్‌రావు తెలిపారు. కాగా, ఎవరైనా కొలతల్లో మోసాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
