• నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు 17 సంస్థలకు ప్రజాభిప్రాయ సేకరణ..
• అనుమతులు మంజూరు చేయవద్దని హైకోర్టులో కేస్..!
• ప్రజలు వ్యతిరేకం, ప్రజా ప్రతినిధులు అనుకూలం..
• ప్రజాభిప్రాయ సేకరణకు రెండు రోజుల ముందు ప్రజా ప్రతినిధులకు కోట్లాది రూపాయల ముడుపులు అందాయి?
• కాలుష్య నియంత్రణ మండలి అధికారికి రూ.75 లక్షలా..?
• ఏళ్ళ తరబడి నష్టపరిహారం అందక రైతుల గోస..
• అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో క్రషర్స్ కాలుష్యంతో విలవిల..
• స్థానిక శాసనసభ్యుడే చక్రం తిప్పాడని పెద్ద ఎత్తున ఆరోపణలు..
రంగారెడ్డి జిల్లా మైనింగ్ అధికారికి అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలోని ప్రతి క్రషర్ నుండి ఏడాదికి 3 లక్షలు లంచాల రూపంలో అందుతున్నది నిజమేనా? ఏడాదికి కోటి రూపాయలా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. కాగా అడ్డదారిలో అనుమతులు మంజూరికి టిమ్ ల్యాబ్స్ కన్సల్టెన్సీ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలి ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. కమిటి చైర్మన్ తో లాబియింగ్ జరుపుతున్నది నిజమేనా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
రంగారెడ్డి జిల్లా, అబ్ధుల్లాపూర్ మెట్ మండలంలోని, చిన్న రావిరాల, బండ రావిరాల, సుద్దపల్లి గ్రామాలలో గల గుట్ట ప్రభుత్వభూమిలో సమీప గ్రామాల రైతులకు 40 ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములలో 2009 నుండి కంకర మిషన్స్ ఏర్పాటు చేసి క్రషింగ్ చేస్తున్నారు. ఏళ్ళు గడచినా భూములకు సంబంధించి రైతులకు నష్టపరిహారం అందలేదు.. పైగా కాలుష్యంతో ఇబ్బందులు.. గతంలో ఇచ్చిన అనుమతులకు అదనంగా మరింత విస్తరించడానికి పర్యావరణ అనుమతుల కొరకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తేది:26-07-2022 నుండి 01-12-2022 వరకు జరిగిన కంకర క్రషింగ్స్ కొరకు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించారు. సర్పంచులు. యం.పి.టి.సి.లు. వ్రాత పూర్వకంగా ప్రజలకు సమాచారం లేకుండా మద్దతు ఇవ్వడం ద్వారా కంకర క్రషింగ్స్ లో జరిగిన కార్యక్రమాల కొరకు 15 కోట్ల రూపాయలు.. మద్దతు కొరకు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ముట్టినట్లు ఆరోపణలపై వరుస కథనాలు.. మీ ‘ఆదాబ్ హైదరాబాద్ లో.. ” మా అక్షరం అవినీతిపై అస్త్రం’.. (సోర్స్: ఆదాబ్ హైదరాబాద్)