అటవీశాఖలో ఇంటి దొంగలు

  • స్మగ్లర్లకు అధికారుల అండదండలు
  • సిరికొండ మండలంలోనే డంపింగ్‌ పాయింట్‌లు
  • కార్యాలయాలకే పరిమితమవుతున్న జిల్లా ఉన్నతాధికారులు

అటవీశాఖలో ఇంటి దొంగ ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దట్టమైన కవ్వాల్‌ అభయారణ్యా లు మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. కొందరు అటవీశాఖాధికా రులే స్మగ్లర్లతో చేతులు కలిపి కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి. కంచె చేను మేసిన చందంగా అటవీశా ఖాధికారుల తీరు కనిపిస్తోంది. ఎన్నిసార్లు కట్టడిచర్యలు చేపట్టినా రవాణాకు అడు ్డకట్టపడడం లేదు. కొందరు అధికారుల ధనదాహనికి దట్టమైన అడవులు సైతం అంతరించిపోతున్నాయి.

మోడు వారుతున్న కవ్వాల్‌

కవ్వాల్‌ అడవులకు ముల్తానీల ముప్పు తప్పిందనుకుంటున్న స మయంలోనే కొందరు అవినీతి అధికారుల అండతో కలప స్మగ్లర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. అడవుల రక్షణకు ఎన్నిరకాల చర్యలు చేపట్టిన అటవీసంపద తరలిపోతూనే ఉంది. రెండు దఫాలుగా ఉ మ్మడి జిల్లాకు చెందిన నేతలకే అటవీశాఖ బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్న ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. ఏళ్ల తరబడి కా పాడుకుంటూ వచ్చిన విలువైన వృక్షాలను గంటల వ్యవధిలోనే నరికి తరలించుకుపోతున్నారు. ఎందరో మంది అధికారులను మార్చిన అ దే నిర్లక్ష్యం కనిపిస్తుంది. దట్టమైన కవ్వాల్‌ అడవుల్లోకి వెళ్లేందుకు పూర్తిస్థాయిలో నిషేదాజ్ఞలు ఉన్నా యాథేచ్ఛగా జనసంచారం కని పిస్తుంది. నిత్యం ఇసుక, కలప, మొరంను తరలించుకుపోతునే ఉ న్నారు. కవ్వాల్‌లో ఏర్పాటుచేసిన బేస్‌క్యాంపుల పాత్ర కూడా నామ మాత్రంగానే కనిపిస్తుంది. ఇటీవల ఓ బేస్‌క్యాంపు సిబ్బంది కలప స్మ గ్లర్లతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడడంతో విధుల నుంచి తొ లగించారు. అటవీచుట్టూ కందకాలు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి న అడ్డదారుల్లో అక్రమ కలప రవాణా సాగుతుంది. చెక్‌పోస్టుల వద్ద నిఘా కొరవడడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపో తు న్నారు. ముఖ్యంగా అటవీశాఖ పనితీరుపై నేతలు శాఖ ఉన్నతాధి కారుల సమీక్షలు కరువవుతున్నాయి. ఏటా అడవులు అంత రించుకు పోతూనే ఉన్నాయి. దట్టమైన అడవులకు పేరుగాంచిన కవ్వాల్‌ ప్ర స్తుతం మైదానంగా మారడంపై ఆందోళన రేపుతుంది.

నిత్యం స్మగ్లర్ల గొడ్డలి చప్పుల్లే..

జిల్లాలో మిగిలిపోయిన కవ్వాల్‌ సరిహద్దు అడవుల్లో ని త్యం స్మగ్లర్ల గొడ్డలి చప్పుల్లే వినిపిస్తున్నాయి. అవినీతి అధికా రుల పనితీరుతోనే కవ్వాల్‌ అటవీ ప్రాంతం మైదాన ప్రాంతంగా మారి పోతుంది. తాజాగా సిరికొండ, ఇంద్రవెల్లి సరిహద్దు మండలాల పరిధిలోని వాయిపేట్‌ సెక్షన్‌లోని గోపా ల్‌పూర్‌, ఇంద్రవెల్లి రేంజ్‌లోని ధన్నోరా సెక్షన్‌లోని హీరాపూర్‌ బీట్‌ల పరి ధిలో విలువైన కలపను స్మ గ్లర్లు తరలించుకు పోవడం అధికారుల పనితీ రుకు అద్దంపడుతుంది. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయ డం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ బీట్ల పరిధి లో ఒకరిద్దరు బీట్‌ ఆ ఫీసర్లతో పాటు మండలస్థాయి అధికారి స్మగ్లర్లతో చేతులు కలి పార న్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు కార్యాలయా లకే పరిమితం కావడంతో స్మగ్లర్ల ఆగడాలకు అదుపు లేకుండా పోయింది.

అధికారులే సూత్రధారులు

కవ్వాల్‌ అభయారణ్యంలో జరుగుతున్న కలప రవాణాకు కొందరు అధికారులే సూత్రధారులుగా మారారన్న ఫిర్యా దులు వస్తున్నాయి. అడిగి నంత ఇస్తే అంతా ఓకే అంటూ అఽధికారులే స్మగ్లర్లకు పరోక్ష సహ కారాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. గోపాల్‌పూ ర్‌, హీరాపూర్‌ బీట్‌ల పరిధిలో కొంతకాలంగా అ టవీ సంపద తరలిపోతున్నా అడ్డుకునే నాథుడే కరువయ్యాడన్నా విమర్శలు వస్తున్నాయి. ఉన్న తాధికారులు సైతం చోద్యం చూడడంపై అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీసారి కిం దిస్థాయి అధికారులపైననే వేటు వేస్తూ చేతు లు దులుపుకోవడమే తప్ప లోతుగా దర్యాప్తు చే సిన దాఖలాలు కనిపించడంలేదు. కొందరు అ ధికారులైతే బరితెగించి మరీ బహిరంగంగానే వసూళ్లు చేయడం విమర్శలకు దారితీస్తుంది. బాధ్యతాయుతంగా వి ధులు నిర్వహిస్తే కలప రవాణా ఏవిధంగా జరు గుతుందో అధికారులకే తెలియాలి.

చర్యలు తీసుకుంటాం : కోటేశ్వరరావు, ఎఫ్‌డీవో, ఉట్నూర్‌

వాయిపేట్‌ సెక్షన్‌ పరిధిలోని గోపాల్‌పూర్‌, చెమ్మన్‌గుడి, హీరాపూర్‌ బీట్లలో కలపను తరలించుకుపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరిగింది. త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ కలప ర వాణాను అడ్డుకునేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశ ప్రకారమే క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలుంటాయి. ప్రజలందరూ నిబంధనలు పాటించాలి. (సోర్స్: ఆంధ్రజ్యోతి)