తెలంగాణ పిసిబిలో తాను చెప్పిందే వేదం అంటున్న “ఇ.ఇ. శ్రీవాత్సవ..!”

  • ప్రధాన కార్యాలయంలో ఉండగా రెచ్చిపోయిన ఈ సారు..
  • హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేసిన కూడా మారని తీరు…
  • తాను అడిగింది ఖరీదైన గిఫ్ట్ ల రూపంలో అందాల్సిందే.. లేదంటే ఇక వారి పని అయిపోయినట్టే..!
  • తవ్విన కొద్ది బయటపడుతున్న సారు అవినీతి వ్యవహారాలు..
  • తన మాటవింటే సరి.. లేకపోతే మాట వినని పరిశ్రమలు, ఆస్పత్రులపైనే చర్యలు..
  • జోనల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో అన్నీ తానే.. ఈయన గారి చర్యలన్నీ బాధితుల పైనే..
  • ఈయన గారి చేష్టలతో అసహనంతో రగిలిపోతున్న పొల్యూషన్ బాధితులు, పర్యావరణ వేత్తలు..

అది పర్యావరణాన్ని కాపాడాల్సిన బోర్డు.. పొల్యుషన్ ను కట్టడి చేసి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బోర్డు.. కానీ అక్కడ జరిగే తంతు వేరే ఉంటది పొల్యూషన్ ను కంట్రోల్ చేసుడు దేవుడెరుగు.. అక్కడ ఈయన (శ్రీవాత్సవ) గారు చెప్పిందే వేదం.. తాను చెప్పిందే నడవాలి.. లేదంటే ఇక అంతే సంగతులు.. తన ఈగో దెబ్బతింటది.. ఈగో దెబ్బతింటే ఇక అంతే.. తనకు తానే ఓ డిక్టేటర్ ల ఫీల్ అవుతాడని పిసిబిలో తోటి అధికారుల నోట వినిపిస్తున్న మాట.

పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులకు కావల్సినంత అండ అందిస్తూ.. ఫిర్యాదుదారులనే తప్పుదోవ పట్టిస్తూ మరియు తప్పు పడుతూ సారు కోపంతో కొట్టినంత పని చేస్తాడని పలువురు ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రులకు ఇతగాని సపోర్ట్ గురించి అయితే చెప్పాల్సిన పనేలేదు. కార్పొరేట్ ఆస్పత్రుల కోసం పిసిబి నిబంధనలను సైతం తుంగలో తొక్కి ఎంతకు తెంగించైన సరే కార్పొరేట్ ఆస్పత్రులకు కొమ్ముకాస్తాడని.. అయినా పట్టించుకునే వారే ఉండరు అని పలువురు పిసిబి అధికారులే చెప్తున్న మాట. అంతేకాదు తప్పు చేస్తున్న పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రుల నుండి లంచం పెద్ద పెద్ద ఖరీదైన గిఫ్ట్ ల రూపంలో ఇవ్వాల్సి ఉంటదని లేదంటే ఇక వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాపించడంలో సారు దిట్ట అని పలువురి నోట వినిపిస్తున్న మాట. అంతేకాకుండా పరిశ్రమల నుండి లేదా ఆస్పత్రుల నుండి ఆయా సంస్థలకు సంబందించిన కిందిస్థాయి ఇతర అధికారులు (జి‌ఎం, మేనేజర్ etc..) ఎవరైనా వస్తే వారి మీద కూడా అరుస్తూ మీరు ఎందుకు వచ్చిన్రు మీ ఎండి ని కానీ, ఓనర్ ని కానీ రమ్మను అని ఊగిపోతాడని అందరికీ తెలిసిన విషయమే.

ఇది ఇలా ఉంటే మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే జోనల్ కార్యాలయం హైదరాబాద్ లో జె.సి.ఇ.ఇ. కృపానంద్, ఎస్.ఇ.ఇ. నరేందర్ ఉండగా ఇ.ఇ. గా ఉన్న శ్రీవాత్సవ టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో అంతా తానై నడిపిస్తాడని పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రులకు అండగా నిలుస్తూ పొల్యూషన్ బాధితులైన ఫిర్యాదుదారులపై గట్టిగా అరుస్తూ.. కోపంతో ఊగిపోతూ.. వారి బాధలను చెప్పుకోకుండా అడ్డుపడటమే కాకుండా బయటకు వెళ్లిపోవాలని.. మరోసారి ఫిర్యాదు చేస్తే బాగోదని హెచ్చరికలు జారీచేస్తాడని పలువురు బాధితులు వాపోతున్నారు.

ఇటీవల అనగా గత నెల మొదటి వారంలో జోనల్ కార్యాలయంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ పై గతంలో వచ్చిన ఫిర్యాదు పై జరిగిన టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో నిబంధనలను తుంగలో తొక్కి యధేచ్చగా పొల్యూషన్ చేస్తున్న హాస్పిటల్ కి అండగా నిలుస్తూ హాస్పిటల్ యజమాన్యాన్ని మీటింగ్ కు పిలవకుండా ఫిర్యాదు చేసిన వారిని మీటింగ్ కు పిలిచి ఫిర్యాదుదారు చెప్పేది వినకుండా ఫిర్యాదు చేసిన ఆమె పైనే అరుస్తూ శ్రీవాత్సవ చేసిన ఓవరక్షన్ అంతా ఇంతా కాదని ఫిర్యాదుదారురాలే చెప్పి వాపోవడం జరిగింది. ఆ హాస్పిటల్ వల్ల తన ఇల్లు డ్యామేజ్ అయిందని పిసిబికి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని గత కొంత కాలంగా భర్త లేని ఆ మహిళ ఒంటరి పోరాటం చేస్తుంటే.. తనకు న్యాయం చేయకపోగా ఫిర్యాదు చేసే వరకు కనీసం కొన్ని సంవత్సరాల నుండి బిఎండబ్ల్యు మరియు సిఎఫ్ఒ రెన్యూవల్ కూడా చేసుకోని ఆ హాస్పిటల్ కు పిసిబి తరుపున పూర్తి మద్దతు ఇస్తూ ఆ మహిళను ఇబ్బంది పెట్టడంలో పిసిబి అధికారులే ముందు వరుసలో ఉండటం ఎంత వరకు సమంజసం. శ్రీవాత్సవ అరుపులకు ఆ మహిళ భయపడి పోతుందనుకున్నారేమో.. ఇంత జరిగిన ఆ మహిళ పట్టువదలకుండా పిసిబి హైదరాబాద్ జోనల్ అధికారులపై HRCలో ఫిర్యాదు చేయడం గమనార్హం. అక్కడ ఏం జరుగుతుందో వేచి చూద్దాం..

ఇప్పుడే కాదు గతంలో ఇ.ఇ. గా పనిచేసిన చోట కూడా ఈయన గారు తీరు ఇలాగే ఉంటే తట్టుకోలేకనే హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేశారని ఇక్కడ కూడా తీరు మార్చుకోవడం లేదని అలాగే గతంలోనూ ఈ సారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అని అందరి నోట వినిపిస్తున్న మాట. ఈ సారు అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ఆస్పత్రుల యజమాన్యాలు తలపట్టుకుంటున్నాయని వినికిడి. అవినీతి చేయడంలో కూడా ఈయన గారు కొత్త రకమైన పంథాను కొనసాగిస్తున్నడు అని వినికిడి. తాను పనిచేసి పెట్టినందుకు గాను ఎవరి నుండైన పెద్ద పెద్ద ఖరీదైన గిఫ్ట్ ల రూపంలో తీసుకుంటాడని అందరి నోట వినిపిస్తున్న మాటే.

తనకు నచ్చిన విధంగా అందరూ ఉండాలని పిసిబి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని కనుక పిసిబిలో తనకు తెల్వకుండా ఏం జరగదని.. జరుగవద్దని పిసిబికి తానే ఛైర్మన్, ఎం.ఎస్. అన్నట్లుగా వ్యవహరిస్తూ తాను ఏది చెప్తే అదే శాసనంగా జరగాలని వ్యవహరిస్తూ.. మొన్నీ మధ్య పిసిబిలో జరిగిన ఉద్యోగుల ట్రాన్స్ ఫర్స్ విషయంలో కూడా ఛైర్మన్, మెంబర్ సెక్రటరీలు తనకు చెప్పకుండా ఇష్టారీతిన ఉద్యోగులను ట్రాన్స్ ఫర్స్ చేశారని తనకు నచ్చిన చోట పోస్టింగ్ ఇవ్వనందుకు ఈయన గారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని తోటి పిసిబి అధికారులే చెప్తుండటం గమనార్హం. తన అవినీతి సామ్రాజ్యాన్ని తన ఇష్టారాజ్యంగా నడుపుతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అంతేకాదు, సారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చేయి పెట్టిండని ఖరీదైన ప్లాట్లను గిఫ్ట్ ల రూపంలో బినామీ పేర్ల మీద తీసుకుంటాడని విశ్వసనీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అంతేకాదు నేను ఏంచేసిన సరే చూసుకోవడానికి మా బంధువు ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నాడు అని సారే స్వయంగా చెప్పుకుంటూ ఉంటాడని తోటి అధికారులే చెప్తుంటారు. ఈయన గారి దెబ్బకు ఇప్పుడు జోనల్ కార్యాలయంలో మీటింగ్ అంటేనే ఇండస్ట్రీ వాళ్ళు, కార్పొరేట్ ఆస్పత్రుల వాళ్ళు భయపడే పరిస్థితి ఉందని సదరు యాజమాన్యాలు వాపోతున్నాయి.

ఈయన గారి అవినీతి బాగోతం తెలియకుండా చేసుకోవడంలో ఈయన గారు దిట్ట అని, ఈయన గారి అవినీతి ఊహకందనిదని ఈ అవినీతి మాయాజాలం బయటపడాలంటే ఏసీబీలోని ఉన్నతాస్థాయి అధికారులతో విచారణ జరిపిస్తేనే బయటపడుతుందని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే పలువురు అధికారులు చర్చించుకోవడం ఆశ్చర్యకరం.

ఈయన గారి అవినీతి బాగోతాలపై మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…