పశు సంరక్షణలో మైహోం సిమెంట్ పరిశ్రమ సేవలు అభినందనీయం

పశుసంరక్షణలో మైహోం సిమెంట్ పరిశ్రమ అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ డి.శ్రీనివా్‌సరావు అన్నారు. శనివారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో మైహోం సిమెంట్ పరిశ్రమ సహకారంతో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా పశు వైద్యశిబిరాన్ని పరిశ్రమ ప్రెసిడెంట్‌ ఎన్.శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పశువులకు వచ్చే సీజినల్‌ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాభివృద్ధితో పాటు విద్యా, వైద్య రంగానికి ఎల్లప్పుడు తమవంతు సహకారాలు అందిస్తామని ప్రెసిడెంట్‌ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్‌ శంకర్‌కట్టా, సర్పంచ గుండెపంగు కృష్ణవేణినరేష్‌, మైహోం సిమెంట్ పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరావు, అడ్వైజర్‌ జగన్నాథరావు, పశు వైద్యాధికారులు సుష్మిత, ఉషారాణి, శ్రీనివాస్ రెడ్డి, గోపాలమిత్ర సిబ్బంది, నాయకులు, పరిశ్రమ ప్రతినిధులు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.