తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

 నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. సచివాలయం ప్రారంభం తర్వాత పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం.