పర్యావరణ పరిరక్షణ సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ సమితి 2023 క్యాలెండర్ ను సోమవారం నాడు హైదరాబాద్ అరణ్యభవన్ లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పచ్చదనం పెరిగేలా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినం అని చెప్పారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలిపునిచ్చారు. భూమిపై మానవులు మనుగడ సాగించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి నీరు, గాలి, మట్టి అందించాలంటే ప్రతి ఒక్కరూ స్వతహాగా విరివిగా మొక్కలు నాటాలన్నారు.