సింగరేణిలో అద్భుతమైన రీతిలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఆస్పత్రి ఆవరణంలో మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు , అనంతరం డాక్టర్ పద్మజ మాట్లాడుతూ పది కోట్ల మొక్కల్ని మన రాష్ట్రంలో నాటి హరిత తెలంగాణను చేయాలని ఉద్దేశం రాష్ట్రంలో నాలుగు కోట్ల మొక్కలు నాటడం జరిగింది అందులో భాగంగానే ఈ చాలెంజ్ యాక్సెప్ట్ చేసి మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈరోజు ఈ ఛాలెంజ్ ని బసవయ్య జీఎం పర్సనల్ కార్పొరేట్, కుమార్ రెడ్డి జీఎం సెక్యూరిటీ మరియు సల్మాన్ డిజిఎం పర్సనల్ కి విసురుతూ ముఖ్యంగా మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా భూమి పై విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి జంతువులు కోతులు జనసంచారం చేస్తున్నాయి,జంతువులు పక్షులు అన్ని చాలా ఇబ్బంది పడుతున్న మనము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడం తో పాటు కోతులు తిరిగి అడవుల్లోకి వెళ్లి పోయేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతి ఒక్కరు పాల్గొని వారి వంతుగా మొక్కలు నాటాలని వారు కోరారు . ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.