కొత్తపల్లి-తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎండీ హబీబొద్దీన్ ఆధ్వర్యంలో బొక్కల కంపెనీ ఎదుట గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ.. బొక్కల కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కంపెనీనీ తక్షణమే మూయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సర్పంచ్ ఎండీ హబీబొద్దీన్, సి.గుండాలు పాల్గొన్నారు.