యాచారం మండలం కొత్తపల్లి సమీపంలో కిసాన్ ఆగ్రోఫీడ్ పేరిట ఉన్న బొక్కల కంపెనీని మూయించాలని శుక్రవారం శాసనసభలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఎముకల కంపెనీ కారణంగా రైతులు, పొలం పనులు చేస్తున్న కూలీలు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారని ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఎముకలతో నూనె తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కాగా, ఎమ్మెల్యే శాసనసభలో ప్రస్తావించడంతో కొత్తపల్లి, తక్కళ్లపల్లి, కిషన్పల్లి. తమ్మలోనిగూడ గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.