సీఎం కేసీఆర్ కొండగట్టు టూర్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రేపు(మంగళవారం) కేసీఆర్ కొండగట్టులో పర్యటించాల్సి ఉంది. అయితే మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
బుధవారం ఉదయం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కొండగట్టును ఆలయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. తర్వాత ఆలయ అభివృద్ధి విషయంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో రివ్యూ చేయనున్నారు. కేసీఆర్ తో పాటు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కూడా కొండగట్టు ఆలయాన్ని పరిశీలించనున్నారు.