తెలంగాణ అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొని వ్యక్తి మృతి

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి (Chairman of the State Forestry Department Vanteru Pratap Reddy) వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మంగళవారం ఉదయం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్తేల్లి 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింలు(48) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ప్రమాద సమయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి వాహనంలోనే ఉన్నారు. ప్రతాప్ రెడ్డిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని ప్రతాప్ రెడ్డిని వేరే వాహనంలో పంపించివేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు.