గుండేడు గ్రామంలోని కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

బాలానగర్ మండలం గుండేడు గ్రామ పంచాయతీ పరిధిలోని మహావీర్ ఐరన్ పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యం నుండి గ్రామం చుట్టూ వుండే పంటలకు నష్టం జరుగుతుంది మరియు గ్రామ ప్రజలు అనారోగ్యం పలావుతున్నారని వెంటనే పరిశ్రమను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ముసివేయాలని గుండేడు గ్రామ ప్రజలు గత కొన్ని రోజులుగా నిర్వీరామంగా కంపెనీ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. గుండేడ్ గ్రామంలోని మహావీర్ ఐరన్ పరిశ్రమ గేట్ ముందు పార్టీలకు అతీతంగా చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి బీజేపీ తరపున సంఘీభావం ప్రకటించి పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడారు. పరిశ్రమ యాజమాన్యం 100శాతం కాలుష్యాన్ని నియంత్రించాలని, లేదంటే పరిశ్రమను మూసుకోవాలని బీజేపీ తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహ్మరెడ్డి, నాయకులు చెన్నారెడ్డి, నర్సింహులు, ప్రజలు పాల్గొన్నారు.