బ్యాటరీ కంపెనీని స్వాగతిస్తున్నాం : ప్రెస్‌మీట్‌లో దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి వాసులు

  • లిథియం పరిశ్రమతో నష్టం లేదు
  • దేశంలోనే మొదటగా ఇక్కడే..
  • ఇండస్ట్రీ ఏర్పాటుతో తరతరాలు బాగుపడతాయి
  • ఈ పరిశ్రమతో ఎలాంటి కాలుష్యం లేదు
  • అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దివిటిపల్లి వద్ద ఏర్పాటు
  • వేలాది మందికి ఉద్యోగావకాశాలు

‘బ్యాటరీ కంపెనీ రావాలె.. అందరి బతుకులు మారాలె.. లిథియం గిగా ప్యాక్‌ సెల్‌ పరిశ్రమతో మాకెలాంటి నష్టం లేదు.. ఏర్పాటుతో తరతరాలు బాగుపడ్తాయి.. కాలుష్య సమస్య లేదు.. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. అందుకే ఇండస్ట్రీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం’.. అని దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి వాసులు వెల్లడించారు. గురువారం మహబూబ్‌నగర్‌లో వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కంపెనీ దివిటిపల్లి సమీపంలో ఏర్పాటు కావడం శుభదాయకమన్నారు. మొదట వద్దన్నా.. కాలుష్యం ఉండదని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించడంతో కంపెనీ ఏర్పాటుకు ఒప్పుకొంటున్నట్లు తెలిపారు. పాలమూరులో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు కుట్రకు తెరతీస్తున్నాయని ధ్వజమెత్తారు. మంత్రి ఏది చేసినా ప్రజల మంచి కోసమే చేస్తారని చెప్పుకొచ్చారు.

దివిటిపల్లి వద్ద అమరాన్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న లిథియం గిగా ప్యాక్‌ సెల్‌ పరిశ్రమతో ఎలాంటి కా లుష్యం ఉండబోదని, వేలాది మందికి ఉపాధి అ వకాశాలు పెరుగుతాయని పరిశ్రమ ఏర్పాటు చే యనున్న సమీప గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి ప్రజలు పేర్కొన్నారు. గురువారం జి ల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. బ్యాటరీ పరిశ్రమతో కాలుష్యం ఉంటుందేమో అనే భయంతో మొదట తాము ఈ పరిశ్రమను వద్దన్నామన్నారు. అయితే, కాలుష్యం ఉండబోదని నిపుణులు, శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్నామని మాజీ ఉపసర్పంచ్‌ హనుమంతు తెలిపారు. ఈ ప్రాంతం నుం చి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. లిథియం పరిశ్రమతో ఎలక్ట్రికల్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీలు తయా రు చేసి.. ప్రపంచంలోని కాలుష్యాన్ని తగ్గించేందు కు అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై స్థానికులందరికీ వివరంగా తెలియజేస్తామన్నారు.

పరిశ్రమ తెచ్చిన మంత్రికి కృతజ్ఞతలు

దివిటిపల్లి వద్ద రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పది వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే లిథియం పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని దివిటిపల్లి మాజీ సర్పంచ్‌ ముఖరం జ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా లిథియం కొరత వేధిస్తుంటే మన దేశంలోని కశ్మీర్‌లో 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు తేలడం తో ప్రపంచం దృష్టంతా మనపైనే ఉందన్నారు.

ఈ లిథియం మన దివిటిపల్లి పరిశ్రమకు ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలు, తెలంగాణలోని ఇతర జిల్లాలు ఈ పరిశ్రమను తమ ప్రాంతానికి తీసుకుపోయేందుకు తీ వ్రంగా పోటీపడినా వెనుకబడిన మన జిల్లాను అ భివృద్ధి చేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఎదిరకు చెందిన సూద నర్సింహులు తెలిపారు. గతంలో కాలుష్యాన్ని వెదజల్లే కాటన్‌ మి ల్లును సాకుగా చూపించి లిథియం పరిశ్రమను అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నడం సరికాదన్నారు.

ఏపీలో స్థానిక రాజకీయాలతో అక్కడ త లెత్తిన వివాదాలను మనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమను తామంతా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఏ కార్యక్రమం తలపెట్టినా స్థానిక ప్రజల మంచి కోసమేనని మాజీ సర్పంచ్‌ జంగన్న తెలిపారు. లిథియం పరిశ్రమతో ఈ ప్రాంతం మ రింత వేగంగా అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. పరిశ్రమకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. కార్యక్రమంలో హకీం, అల్లి ఎల్లయ్య, బీ.శ్రీనివాసులు, నవకాంత్‌రెడ్డి, చెన్నారెడ్డి, పాండురంగారెడ్డి, సుభాన్‌, సురేందర్‌, రాజు, కావలి శేఖర్‌ తదితరులున్నారు.