ఈ కాలుష్య పరిశ్రమ మాకొద్దు అంటూ టైర్ల పరిశ్రమ ముందు పలువురు రైతులు ధర్నా చేపట్టిన సంఘటన మేదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధి కామారం శివారులో గల సాయిదుర్గ టైర్ల పరిశ్రమ ముందు కామారం రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రాత్రివేళ దట్టమైన దుర్గంతపూరితమైన పొగ రావడంతో ఊపిరాడనివ్వడం లేదని దీంతో ప్రజలు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా పరిశ్రమ నుండి వెలువడుతున్న కలుషితనీరు తమ బోరుబావులోకి చేరడం వల్ల పంట దిగుబడి రావడంలేదని వేసిన పంటలు ఎదగడం లేదని పరిశ్రమ నుండి వెలువడుతున్న కలుషిత నీరు బోరుబావిలోకి చేరి తీవ్రంగా పంట నష్టపోతున్నామని కనీసం తాగడానికి కూడా పనికిరాని స్థితిలో ఆ నీరు ఉంటున్నాయని పొలంలో పనులు చేసుకుంటే కాళ్లు చేతులు పగిలి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని వారు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆ కంపెనీ యాజమాన్యం దృషికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలుమార్లు కాలుష్య నియంత్రణ అధికారులు మరియు పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామంలోని చిన్నపిల్లలు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఈ కాలుష్య పరిశ్రమను మూసివేసే వరకు ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.