ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగారెడ్డి జిల్లా డీఈఓ

సంగారెడ్డి జిల్లా డీఈఓ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఈఓ తోపాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ కూడా ఏసీబీకి చిక్కారు. మార్చి 24న సంగారెడ్డి పరధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ స్యూల్ కు ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాలని డీఈఓ రాజేష్ ను కోరారు. అయితే ఎన్ఓసీ ఇవ్వడానికి ఒప్పుకున్న.. డీఈఓ తన రూ.50 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

దీంతో బాధితులు సంగారెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారుల సూచనల మేరకు శుక్రవారం డీఈఓ ఆఫీసులో రూ. 50 వేలు లంచం ఇస్తుండగా డీఈఓ రాజేష్ పట్టుకున్నారు.. కేసు నమోదు చేసి డీఈఓని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.