పిసిబి ప్రభుత్వ సంస్థనా.. లేక కొంతమంది శృతిమించిన అవినీతి అధికారుల జేబు సంస్థనా…?

  • పిసిబి అధికారుల జీతాలు పరిశ్రమలు చెల్లించే ఫీజుల రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయంతో ఇవ్వటం లేదా..?
  • అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది దేనికి..? దాని పని ఏంటి..? అక్కడ జరుగుతున్నది ఏంటి..?
  • ఇక్కడ కొంతమంది అధికారుల పెత్తనం ఏంటి..?
  • ఉన్నతాధికారులను కూడా శాసించాలని చూస్తున్నది ఎవరు..?
  • పిసిబి ప్రభుత్వ పరిధిలోకి రాదా…?
  • ప్రభుత్వ రంగ స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన పిసిబి కొంత మంది అధికారుల జేబు సంస్థనా…?
  • పిసిబిలోకి ఉద్యోగులుగా వెళ్ళి అక్రమ సంపాదనతో పెత్తనాలు చేస్తున్నది ఎవరు..?
  • కిందిస్థాయిలో ఉండి కూడా.. పై స్థాయి అధికారులను కంట్రోల్ చేయడం ఏంటి..?
  • తన పైస్థాయి అధికారులతో పాటు పిసిబి ఛైర్మన్, మెంబర్ సెక్రెటరీ లు కూడా తన మాటే పాటించాలి అనే అహంకారం దేనికి…? ఆ అధికారి యొక్క అహంకారానికి హద్దే లేదా..?
  • పిసిబిలోని ఉద్యోగులందరూ ఆయన రికమండ్ తోనే వచ్చినట్లు ఆ అజమాయిషీ ఎందుకు..?
  • వాళ్ళకు స్వతంత్ర భావాలు, ప్రొపెషనల్ ఎథిక్స్ (వృత్తి విలువలు), నైతిక విలువలు లేవా..? వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించలేదా..?
  • పై అధికారులు కూడా ఈయన గారి కింద గులాం గిరి చేయాలనే పోకడ ఏంది..?
  • పిసిబి అధికారులు ప్రభుత్వ వ్యవస్థలో ప్రజల కోసం లేరా…?
  • పిసిబి ఏమైనా ప్రైవేటు జేబు సంస్థనా..?
  • అవినీతిలో శృతిమించిపోయిన కొంత మంది పిసిబి అధికారులు చేస్తున్న తప్పులను చెప్పొద్దా..?
  • కొంతమంది పిసిబి అధికారులకు కాలుష్య బాధితుల గోడు పట్టదా..?
  • పిసిబిలో నేను చెప్పిందే నడవాలనే అహంకారం ఆ అధికారికి ఎందుకు..?
  • పిసిబిలో ఇంత చేస్తున్న ఆ అధికారి ఏమైనా నిజాయితీ పరుడా…?
  • కార్పొరేట్ హాస్పిటల్స్ కు కొమ్ము కాస్తే ఏం చేసిన చెల్లుతుందా…?
  • కొంతమంది పిసిబి అధికారులు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు వారి ఆస్తుల విలువ ఎంత..? ప్రస్తుతం వారి ఆస్తుల విలువ ఎంత..?
  • అంతలా అక్రమాస్తులు పెరగడం, బినామీల పేర్ల మీద పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?
  • పిసిబిలో శృతిమించిన కొంతమంది అవినీతి అధికారులపై వార్తలు రాస్తే జీర్ణించుకోలేకపోతున్నారా…?
  • వారు చేస్తున్న తప్పులు వారికి కనిపించవా..?
  • వారు ఏమైనా చట్టానికి చుట్టాలా..?
  • ఇలాంటి విచ్చలవిడి అవినీతికి అలవాటుపడిన అధికారులపై విజిలెన్స్ & ఎంఫోర్స్ మెంట్ మరియు ఎసిబి అధికారులు దాడులు చేయరు అనే ధైర్యమా…?
  • పరిశ్రమల వారి తప్పులే వీరి యొక్క ఆదాయం…? పరిశ్రమల వారు ఎవరికీ చెప్పరు..? బయటపెట్టరు అనే ధైర్యమా..?
  • ఇలా అయితే పిసిబిలోని అవినీతి అనకొండల భరతం పట్టేది ఎవరు..?
  • కాలుష్య బాధితులకు న్యాయం జరిగేది ఎప్పుడు..?
  • వీరు ఏమైనా ఐ‌ఎఎస్, ఐఎఫ్ఎస్, అధికారుల కంటే ఎక్కువనా..?
  • పిసిబిలో తమ పెత్తనానికి అడ్డుకట్ట పడుతుందనే భయమా..?
  • పిసిబిలోని కొంతమంది అధికారులు.. తాము ప్రభుత్వ పరిధిలోని అధికారులం అనే సంగతి ఎందుకు మర్చిపోతున్నారు..?
  • ప్రభుత్వంలో భాగమైన పిసిబి అధికారులు ప్రజల కోసం పనిచేయడానికి.. నిబంధనలకు విరుద్దంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను కట్టడి చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సోయి ఎందుకు లేకుండా పోతుంది..?
  • పిసిబిలో అవినీతి జరగడం లేదా..?
  • పిసిబిలో శృతిమించిన కొంతమంది అధికారులు ఏ స్థాయి విచారణకు అయిన సిద్దంగా ఉన్నారా…?
  • అదే నిజం ఐతే కాలుష్య బాధితులకు 10% న్యాయం కూడా జరగడం లేదని ఎందుకు వాపోతున్నారు..?
  • కాలుష్య బాధితులు పరిశ్రమలపై చేస్తున్న ఫిర్యాదులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
  • కొంతమంది శృతిమించిన అవినీతి పిసిబి అధికారులు చేస్తున్న తప్పులను ఎవరు చెప్పొద్దా..?
  • వీరి చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తదని వీరికి తెల్వదా..?
  • ఎన్నికల్లో మేం పోటీ చేయం కదా.. ఎవరు ఎలా పోతే మాకెందుకు అనే ధీమానా..?
  • కొంతమంది పిసిబి అధికారుల వైఖరితో ప్రజల్లో.. కాలుష్య బాధితుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తది అనే సోయి ఎందుకు లేకుండా పోతుంది..?
  • కొంతమంది పిసిబి అధికారుల వైఖరి వల్ల రాష్ట్రం కాలుష్యమయం అవుతున్నది ఆ సంగతి వీరికి తెల్వదా..?
  • ఎన్ని పరిశ్రమలు పిసిబి రూల్స్ ప్రకారం నడుస్తున్నాయి..?
  • ఎన్నో ఆస్పత్రులు సిఎఫ్ఒ, సిఎఫ్ఇ లు లేకుండా సంవత్సరాలకు సంవత్సరాలు నడుస్తున్న ఎందుకు ఈ అధికారులకు కనపడటం లేదు..? వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
  • ఎన్ని ఆస్పత్రులు ఎస్టీపిలను పిసిబి రూల్స్ ప్రకారం నడుపుతున్నాయి..?
  • దీని వెనుక ఎటువంటి అవినీతి జరగడం లేదా..?
  • ఉన్న విషయం చెప్తే కొంతమంది శృతిమించిన అవినీతి అధికారులకు ఉలుకెందుకు..?
  • సీఎం కేసీఆర్ గారికి రాజీవ్ శర్మలాంటి పెద్దలు ప్రభుత్వ సలహాదారులుగా ఉండి.. పిసిబి ఛైర్మన్ గా కూడా ఉండటం ఇష్టంలేని కొంతమంది పిసిబి అధికారులు ఎవరు..?
  • అంటే సీఎం కేసీఆర్ నిర్ణయించిన నియామకాన్నే ఈ అధికారులు తప్పుపడుతున్నారా…?
  • ఈ శృతిమించిన కొంతమంది అవినీతి అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోడానికి పిసిబి ఛైర్మన్, మెంబర్ సెక్రెటరీలను కూడా తప్పుడు ప్రచారాలతో బదనాం చేస్తున్న ఆ కొంతమంది పిసిబి అధికారులు ఎవరు..?
  • అసలు వీళ్ళకి మేం ప్రభుత్వ అధికారులం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మా పనితనం ఉండాలి అనే సోయి ఎందుకు లేకుండా పోతుంది..?
  • కొంతమంది పిసిబి అధికారుల తీరుపై మండిపడుతున్న కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తల ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు..?
  • త్వరలో పిసిబిలోని కొంతమంది అధికారుల తీరు, వారి అవినీతిపై కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (హైదరాబాద్)లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్), ప్రిన్సిపల్ సెక్రెటరీ, పిసిబి ఛైర్మన్ మరియు మెంబర్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్లడమే కాక.. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి పిసిబిలో జరుగుతున్న అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు కాలుష్య బాధితులు, మేధావులు, పర్యావరణ వేత్తలు సమాయత్తం అవుతున్నారు. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…