బ్లాక్ గ్రానైట్ లీజు రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

నల్లగొండ జిల్లా నర్సింగ్ బట్ల, కూతురు గూడెం, నారాబోయిన గూడెం, గుడాపూర్ గ్రామాలకు సమీపంలోని శ్రీ గాయత్రీ మైనింగ్ కంపెనీ సుమారు 37 ఎకరాల వ్యవసాయ భూమిలో మైనింగ్ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు కోరింది. దానికి ఈ గ్రామాల పరిధిలోని భూమిని లీజుకు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్కడి స్థానిక ప్రజల నుండి ఏమైనా అభ్యంతరం ఉంటే మైనింగ్, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి తెలపాలని కోరారు. కానీ అక్కడి గ్రామాల ప్రజలకు గానీ రైతులకు గానీ ఎలాంటి సమాచారం లేదు అని ప్రజాభిప్రాయం పేరున కొంత మందికి ఇది గ్రామ సభ అని అలాగే అక్కడి ప్రజలకు అవకాశం ఇవ్వకుండా ఆ కంపెనీకి అనుకూలంగా వుండే కొంత మంది మరియు కొన్ని సంస్థల సభ్యులతో వారికి అనుకూలంగా మాట్లాడించి ఊర్లో వారికి అవకాశం ఇవ్వకుండానే వారి గొంతును నొక్కి వేశారు అని అక్కడి ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. నర్సిగ్ బట్ల గ్రామానికి అతి చేరువలో ఈ మైనింగ్ తతంగం అంత జరుగుతుంది. ప్రజల తీర్మానం లేకుండానే అక్కడి స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వారికి తీర్మానం ఇచ్చిన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా మైనింగ్ జరిగే ప్రాంతం చుట్టూ పక్కల రైతులతో ప్రజాభిప్రాయం, ప్రజలకు ఆ మైనింగ్ వల్ల తరువాత తరాలకు జరిగే నష్టాన్ని అధికారులు, పర్యావరణ పరిరక్షణ సభ్యులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలుపుతారా లేదా వేచి చూడాలి. ఇక్కడ స్థానిక ప్రజలకు తెలియని విషయం ఏంటి అంటే ప్రజాభిప్రాయాన్ని తు తు మాత్రంగా జరిపి వారికి రావాల్సిన అనుమతులను ఎవరికి ఎంత ముట్టచెప్పాలో అంత ముట్టచెప్పి తెచ్చుకుంటారని ఈ తతంగం అంతా హైదరాబాద్ లోని ఓ ఆఫీసులో జరుగుతుందని అక్కడి అమాయక ప్రజలకు తెలియదు. త్వరలోనే కొంతమంది అవినీతిపరుల బాగోతం బయట పెడతామని.. నిజ నిజాలను ప్రజల ముందు ఉంచుతామని పలువురు పర్యావరణ వేత్తలు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ అనే ఓ నాటకాన్ని దాని వెనుక జరుగుతున్నా బాగోతలను కూడా త్వరలో బయటకు తెస్తామని పలువురు చెప్పారు.