అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి. నామినేషన్లకు గడువు నేటితో ముగినున్న నేపథ్యంలో గురువారం రాత్రి కాంగ్రెస్ (Congress) పార్టీ తుది జాబితాను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ (BJP) ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. దీంతో జనసేనతో (Jenasena) కలిపి రాష్ట్రంలోని మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
ఆ 12 మంది ఎవరంటే..
- బెల్లపల్లి- అమరరాజుల శ్రీదేవి
- పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
- సంగారెడ్డి- దేశ్‌ఫాండే రాజేశ్వరరావు
- శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్
- మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి
- మల్కాజిగిరి- ఎన్.రామచంద్రరావు
- నాపంల్లి- రాహుల్ చంద్ర
- చాంద్రాయణగుట్ట- కే.మహేందర్
- కంటోన్మెట్- గణేశ్ నారాయణ్
- దేవరకద్ర- ప్రశాంత్ రెడ్డి
- వనపర్తి- అనుజ్ఞా రెడ్డి
- అలంపూర్- రాజగోపాల్
- నర్సంపేట- పుల్లారావు
- మధిర- విజయరాజు