తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గింది : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద 2019 నుండి తెలంగాణలో వివిధ కార్యక్రమాలు/చర్యలు అమలు కార్యక్రమాలతో వాయుకాలుష్యం తగ్గిందని పొల్యూషన్ కట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య అన్నారు.

సనత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్ కుమార్ IAS పి‌సి‌బి (PCB)పై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద 2019 నుండి తెలంగాణలో వివిధ కార్యక్రమాలు/చర్యలు అమలు చేయబడుతున్నాయని తెలిపారు. IIT కాన్పూర్ ద్వారా కూడా సమగ్ర అధ్యయనం నిర్వహించబడింది మరియు వారు చేసిన సిఫార్సులు అమలులో ఉన్నాయి. హరితహారం కార్యక్రమం కింద గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేయడం, స్మార్ట్ లైట్ల ఏర్పాటు, బ్లాక్ టాప్ రోడ్ల ఏర్పాటు, నిర్వహణ, మెకనైజ్డ్ స్వీపింగ్ వంటి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గాలి నాణ్యత మెరుగుపడింది అన్నారు. దేశంలోని ఢిల్లీ, ముంబై మరియు బెంగుళూరు వంటి ఇతర మహానగరాల కంటే హైదరాబాద్ నగరం వేగంగా పట్టణీకరణ చెందుతున్నప్పటికీ పరిసర గాలి నాణ్యతలో ధూళి సాంద్రతలు 11% తగ్గిందన్నారు. రాష్ట్రంలో మురుగునీటి శుద్ధిని మెరుగుపరచడానికి 2023 డిసెంబర్ నాటికి 1259 MLDలు పెంచుతామన్నారు. తద్వారా చెరువుల్లో నీటి నాణ్యత మెరుగుపడుతుందన్నారు.

రాష్ట్రంలో ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను కోసం సభ్య కార్యదర్శి, TSPCB ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో MoEF&CC, CPCB, UNDP మరియు GIZ నిపుణులతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు. తెలంగాణలో కార్బన్ క్రెడిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించబడింది. హరితహారం మరియు మిషన్ కాకతీయ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు. టీఎస్‌పీసీబీ చేస్తున్న కృషిని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్ కుమార్ IAS అభినందించారు.