
మహబూబ్‌నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ఆహ్వానించారు. శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభమై పది రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూధన్, అధికారులు పాల్గొన్నారు.