నల్లగొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు..

నల్లగొండ జిల్లాలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలోని వైదేహీ వెంచర్స్‌తో పాటు రైస్‌మిల్‌ యజమానులు రంగా శ్రీధర్‌, రంగా రంజిత్‌, బండారు కుశలయ్య ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.