తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పరిపాలన సాగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆఖర్లో జై తెలంగాణ.. జై కేసీఆర్.. అంటూ ట్వీట్‌ను ముగించారు.
