జీహెచ్ఎంసీలో ఖాతా తెర‌వ‌ని కాంగ్రెస్.. 24కి 17 స్థానాల్లో బీఆర్ఎస్సే గెలుపు

 గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఓట‌ర్లు భార‌త రాష్ట్ర స‌మితికే ప‌ట్టం క‌ట్టారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 24 అసెంబ్లీ స్థానాల‌కు గానూ 17 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించింది. మిగ‌తా ఏడు స్థానాల్లో.. ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో బీజేపీ వ‌రించింది. గోషామ‌హ‌ల్‌లో బీజేపీ అభ్య‌ర్థి రాజాసింగ్ విజ‌యం సాధించారు.

జీహెచ్ఎంసీలో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులు వీరే..

ముషీరాబాద్ – ముఠా గోపాల్(బీఆర్ఎస్)
అంబ‌ర్‌పేట్ – కాలేరు వెంక‌టేశ్‌
ఖైర‌తాబాద్ – దానం నాగేంద‌ర్
జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
స‌న‌త్ న‌గ‌ర్ – త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
సికింద్రాబాద్ – ప‌ద్మారావు గౌడ్
కంటోన్మెంట్ – లాస్య నందిత‌

మేడ్చ‌ల్ – మ‌ల్లారెడ్డి
మ‌ల్కాజ్‌గిరి – మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద‌
కూక‌ట్‌ప‌ల్లి – మాధ‌వరం కృష్ణారావు
ఉప్ప‌ల్ – బండారి ల‌క్ష్మారెడ్డి

ఎల్‌బీన‌గ‌ర్ – దేవీరెడ్డి సుధీర్ రెడ్డి
శేరిలింగంప‌ల్లి – అరికెపూడి గాంధీ
రాజేంద్ర‌న‌గ‌ర్ – ప్ర‌కాశ్ గౌడ్
మ‌హేశ్వ‌రం – స‌బితా ఇంద్రారెడ్డి
ప‌టాన్ చెరు – గూడెం మ‌హిపాల్ రెడ్డి