ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్టు సమాచారం. తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తున్నది.
ముందుగా తన స్వంత వాహనంలో రాజ్‌భవన్‌కు సీఎం వెళ్లనట్లు వార్తలు వచ్చాయి. ఎలాంటి హైరానా లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటికి వెళ్లినట్లు తెలిసింది. రాజ్‌భవన్‌కు కాకుండా వేరే రూట్లో ఈ వాహనాలు వెళ్లినట్లు సమాచారం. బహుషా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. దాదాపు 60 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే తన సెక్యూరిటీని, కాన్వాయ్‌ని పక్కన పెట్టి స్వంత వాహనంలో బయటికి వెళ్లడం అందరిని ఆశ్చర్యపరించింది.