ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం : డీజీపీ అంజనీకుమార్‌

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. నేడు రేవంత్‌ రెడ్డిని కలిసిన అనంతరం ఈ విషయమై డీజీపీ మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించామన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని రేవంత్‌ రెడ్డి సూచించారని, ఈ మేరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

ఈ మేరకు హైదరాబాద్‌ సీపీతో ప్రమాణ స్వీకారానికి బందోబస్తు ఏర్పాటుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని .. 2+2 గన్‌మెన్లను కేటాయించాలని సీపీని ఆదేశించారు.