హుజురాబాద్, గ‌జ్వేల్‌లో ఈట‌ల రాజేంద‌ర్ ఘోర ప‌రాజ‌యం

 బీజేపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసి, ఓట‌మి చవి చూశారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజురాబాద్‌తో పాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నుంచి కూడా ఈట‌ల పోటీ చేశారు. కానీ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈట‌ల రాజేంద‌ర్ ఓడిపోయారు.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఈట‌ల రాజేంద‌ర్ ఓడిపోయారు. గ‌జ్వేల్‌లో కేసీఆర్ చేతిలో కూడా రాజేంద‌ర్ ఓడిపోయారు. రాజేంద‌ర్ రెండు చోట్ల గెల‌వ‌క‌పోవ‌డంతో.. బీజేపీ శ్రేణులు, అనుచ‌రులు తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు. గ‌జ్వేల్‌లో కేసీఆర్‌పై క‌చ్చితంగా గెలిచి తీరుతాన‌ని ఈట‌ల ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన విష‌యం తెలిసిందే. కానీ అవేమీ వ‌ర్క‌వుట్ కాలేదు. కేసీఆర్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.