జనగామలో గెలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 17 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.