చెట్లతోనే మానవ మనుగడ

  • పద్మశ్రీ వనజీవి రామయ్య

చెట్లతోనే యావత్‌ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు. మంగళవారం ఫారెస్టు అకాడమీ 34 బ్యాచ్‌ బీట్‌ ఆఫీసర్ల సమావేశం హైదరాబాద్‌ దూలపల్లిలో జరిగింది. కార్యక్రమానికి పద్మశ్రీ రామయ్యను ఆహ్వానించిన సంబంధిత శాఖ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు.

చెట్లతోనే యావత్‌ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు. మంగళవారం ఫారెస్టు అకాడమీ 34 బ్యాచ్‌ బీట్‌ ఆఫీసర్ల సమావేశం హైదరాబాద్‌ దూలపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జీవకోటికి చెట్లు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫారెస్టు అకాడమీ హైదరబాద్‌ కోర్స్‌ డైరెక్టర్‌ ఉమ, ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు, ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ పీ.సురేశ్‌కుమార్‌, బీట్‌ ఆఫీసర్‌ ఎం.హరికృష్ణతోపాటు మరో 49 మంది ట్రెయినీ ఆఫీసర్లు పాల్గొన్నారు.