రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంటిని కాజేసేందుకు కుట్ర.. కటకటాలపాలైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి..!

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించి ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కటకటాలపాలయ్యాడు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నవీన్‌ కుమార్‌.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి భన్వర్‌లాల్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

ఈ క్రమంలో ఐపీఎస్‌ నవీన్‌కుమార్‌ ఇల్లు ఖాళీచేయమన్నా లెక్కచేయడంలేదని, పైగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తన ఇంటిని కాజేసేందుకు కుట్ర పన్నాడని రిటైర్డ్‌ ఐఏఎస్‌ భన్వర్‌లాల్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సీసీఎస్‌ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.