హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కలెక్టర్ డీ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ బుధవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు.
హాజరు మినహాయింపు కోరుతూ రంగారెడ్డి కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు వచ్చే నెల 22న తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.