ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిన ప్రపంచం

ఈ ఏడాది ప్రపంచమంతా ప్రకృతి విపత్తులతో పాటు, అత్యంత వేడి ఉష్ణోగ్రతలతో అల్లాడింది. ఈ ఏడాది టర్కీ-సిరియా భూకంపాలతో పాటు దక్షిణాఫ్రికాలో వరదలు, అందమైన అల్జీరియాలలో కార్చిచ్చుతో పాటు పలు దేశాలో భారీ తుపాన్లు, వరదలు, మంచు తుపానుల తాకిడికి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మానవాళి నిర్లక్ష్యం, తప్పులకు ఈ ఏడాది ప్రకృతి విపత్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రముఖ వాతావారణ శాస్త్రవేత్త జేమ్స్‌ హాన్సెన్‌ అన్నారు.