నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనా దీప్తి

 నల్లగొండ(Nalgonda )జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి(Chandana Deepti) బాధ్యతలు స్వీకరించారు(Took charge). ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాబ్‌కు చెందిన చందనా దీప్తిబాధ్యతలు స్వీకరించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, ఎస్‌బీ డీఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్లగొండ డీఎస్పీ శ్రీదర్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్డీ డీఎస్పీ సైదా, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, డీపీవో సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు.