అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ నియామకం రద్దు

అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఆమె వద్ద కాంటాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది నియామకాలు కూడా రద్దు అయినట్టు తెలిపారు. ఆమె కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే సొంత శాఖల్లోకి వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.