ఇథనాల్‌ పరిశ్రమ వద్దంటూ వాహనాలకు నిప్పుపెట్టిన రైతులు.. నిర్మల్‌ జిల్లాలో ఉద్రిక్తత

ఇథనాల్‌ పరిశ్రమ(Ethanol industry) నిర్మాణ పనులను ఆపేయాలని నిర్మల్‌(Nirmal) జిల్లా దిలావార్‌పూర్‌ రైతులు(Farmers) ఆందోళన విధ్వంసం సృష్టించారు. బుధవారం దాదాపు 10 వేల మంది రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. వ్యసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమపై ఇథనాల్‌ పరిశ్రమ కుంపటి పెట్టిందని మండిపడ్డారు. పంట భూములు బీడుగా మారుతాయని ఆవేదన చెందారు. అక్కడే ఉన్న స్కార్పియో, టిప్పర్‌ వాహనాలకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆపేశారు. భాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి రైతులు ఆందోళన కొనసాగిస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.