మేడారం మహా జాతర ఏర్పాట్లు ఈ నెల 31లోగా పూర్తిచేయాలని అధికారులను పలువురు మంత్రులు ఆదేశించారు. జాతర ఏ ర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 75 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక, కొండా సురేఖ తదితరులు సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతోపాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
