• ఇంటి నెంబర్ కోసం రూ. 10 వేలు డిమాండ్
• విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించి అవినీతి అధికారులను బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ బాధితుడి ఇంటి నెంబర్ కోసం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. వారి వివరాల ప్రకారం సదాశివపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వెంచర్ లో గల ఆకుల సంగమేశ్వర్ ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ ఏఈ వెంకట్ రావు చుట్టూ గత కొన్నాళ్లుగా తిరిగాడు. సెప్టెంబర్ 2023 నిర్మించిన ఇంటికి మున్సిపల్ ఇంటి నంబర్ కేటాయించడానికి మున్సిపల్ లో రూ.10 వేలు తనను లంచం అడుగుతున్నారని ఫిర్యాదుదారుడు గత నెల 25న పురపాలక సంఘం ఏఈ వెంకట్రావుపై ఫిర్యాదు చేశారు.. ఇంటి నెంబర్ల కోసం సంబంధిత పత్రాలను అందజేయాలని తెలుపగా.. అందుకు బాధితుడు దానికి సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించారు. కాగా ఇంటి నెంబర్ కోసం 10 వేలు ఖర్చు అవుతుందని డిమాండ్ చేశారు. అందుకు బాధితుడు పత్రాలు ఉండంగా డబ్బులు ఎందుకు ఖర్చు అవుతుందని ప్రశ్నించగా బాధితుని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడంతో విసుగు చెందిన బాధితుడి కుమారుడు శివకుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో దాడులు నిర్వహించి రూ.8 వేలు ఏఈ వెంకట్రావుకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల్ శర్మ కు లంచం ఇస్తుండగా.. పట్టుకున్నారు . సెక్షన్ 7బి, ఎల్ 12 బి కేసు నమోదు చేశారు. ఈ దాడులలో సీఐ వెంకట్ రాజా గౌడ్,ఇన్ స్పెక్టర్ రమేష్ లు ఉన్నారు.
ఇలాంటి అవినీతి జలగలు మేదక్, సంగారెడ్డి లలో వివిధ డిపార్ట్ మెంట్ లలో చాలానే ఉన్నాయి అని త్వరలో వాటి పని కూడా ఏసీబీ అధికారులు పట్టాలని.. అలా అయితేనే ఈ సమాజంలో సామాన్యులు బతకగలుగుతారని స్థానికులు, సామాజికవేత్తలు అంటున్నారు.