• క్రషర్ల ఆగడాలు, భూకబ్జాలు, ఆక్రమణలపై సీరియస్
• కలెక్టర్ అధికారులతో పలుమార్లు సమీక్షలు
• ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
• పటాన్ చెరు ప్రాంతంలో అక్రమార్కులను జల్లెడపట్టాలని ఆదేశాలు
• మంత్రి ఆదేశాలతో రంగంలోకి అధికార యంత్రాంగం
• ప్రత్యేక కమిటీ ఏర్పాటు, లకుడారం క్రషర్లలో ఆకస్మిక తనిఖీలు
• గత ప్రభుత్వ అండతో చెలరేగిపోయిన ప్రజాప్రతినిధులు..
• అధికారుల తనిఖీల్లో వారి ఆగడాలు వెలుగులోకి
• ఎవ్వరిని వదిలిపెట్టం మంత్రి, కలెక్టర్ సీరియస్ గా ఉన్నారు : ఆర్డీఓ రవీందర్ రెడ్డి
అక్రమ మైనింగ్ లపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉగ్రనర్సింహుడిగా మారాడు. క్రషర్ల ఆగడాలు, భూ కబ్జాలు, ఆక్రమణలపై సీరియస్ అయ్యారు. నిబంధనలు పాటించడం లేదని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని వాటిని రక్షించాలని ప్రజల గొంతుకగా మారినా నాటి ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి దామోదర స్పందించారు. అక్రమ మైనింగ్ పై సీరియస్ అయ్యారు. అక్రమ మైనింగ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, వెంటనే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో పటాన్ చెరు మండలం లకుడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్రషర్లపై కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన అక్రమ మైనింగ్ లపై ప్రత్యేక ఈ కమిటీ ఆకస్మికంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక విషయాలు బయటకు రావడం విస్తుగొలుపుతున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ నడుపుతున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్లపై చర్యలు తీసుకుంటాం అని ఆర్డీఓ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.
అక్రమ మైనింగ్ లపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉగ్ర నర్సింహుడిగా మారాడు. క్రషర్ల ఆగడాలు, భూ కబ్జాలు, ఆక్రమణలపై సీరియస్ అయ్యారు. నిబంధనలు పాటించడం లేదని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని వాటిని రక్షించాలని ప్రజల గొంతుకగా మారినా నాటి ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోలేదు. క్రషర్లు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధసలు తప్పకుండా పాటించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, అగ్నిమాపకశాఖ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ లకుడారం, జిన్నారంలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్రషర్లు ఎలాంటి నిబంధనలు పాటించలేదు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అదే కాకుండా ఎలాంటి శిక్షణ లేనివారితో అక్రమ బ్లాస్టింగ్ లకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. క్రషర్లలో పనిచేస్తున్న కార్మికులకు సురక్షితమైన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. పర్యావరణానికి జీవనాధారమైన చెరువులు, కుంటలను ధ్వంసం చేశారు. వాటిలో యథేచ్చగా కాలుష్య జలాలను వదులుతూ మూగజీవాలు, ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టారు. గత అధికార అండతో ప్రజాప్రతినిధులు చెలరేగిపోయారు. ఎవ్వరిని లెక్కచేయకుండా తాము చెప్పిందే వేదం అనే తీరుగా ప్రవర్తించారు. అదే విధంగా లకుడారం గ్రామ ప్రజలు గత వారం రోజుల క్రితం మంత్రి దామోదర్ రాజనర్సిం హను కలిసి వినతిపత్రం అందించారు. అక్రమ మైనింగ్ కంపెనీలపై కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహా స్పందించారు. అక్రమ మైనింగ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామెదర్ అధికారులపై ఫైర్ అయ్యారు. వెంటనే టాస్క్ పోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.
• ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాలతో అక్రమ మైనింగ్ క్రషర్లపై ప్రత్యేక టాస్క్ పోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కేవలం లకుడారం, జిన్నారంలో ఏర్పాటు చేసిన మైనింగ్ కంపెనీల కోసమే ఈ కమిటీ ఏర్పాటయ్యింది. సంగారెడ్డి ఆర్టీఓ రవీందర్ రెడ్డి కన్వీనర్ గా పోలీసు, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ శనివారం కలెక్టర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం సంగారెడ్డిలోని ఆర్టీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టాస్క్ పోర్స్ కమిటీ ఏర్పాటు, కమిటీ మైనింగ్ కంపెనీలలో ఏ విధమైన పరిశీలన చేస్తుందనే విషయాలను వెల్లడించారు. అదే విధంగా పూర్తిగా 10 రోజుల్లో కంపెనీలలో తనిఖీలు నిర్వహించి కలెక్టర్ కు నివేదికను అందిస్తామని ప్రకటించారు. అనంతరం పటాన్ చెరు మండలం లకుడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్రషర్లపై కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన అక్రమ మైనింగ్ లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆకస్మి కంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక విషయాలు బయటకు రావడం విస్తు గొలుపు తున్నాయి. టాస్క్ పోర్స్ కమిటీ సభ్యులు పటాన్ చెరు మండలం లడ్డారం గ్రామంలోని మైనింగ్ క్రషర్లపై పరిశీలనకు వెళ్లగా విస్తుగొలిపే నిజాలు బయటప డ్డాయి. ఒక్క మైనింగ్ కంపెనీ కూడా కనీస నిబందనలు పాటించడం లేదని వెలుగు చూశాయి. కంపెనీలలో ఐద్రతామైన చర్యలు లేకపోవడం, చిన్న పిల్లలతో అక్రమ బ్లాస్టింగ్ చేయించడం వంటి విషయాలు బయటకు వచ్చాయి. అదే విధంగా ప్రజలకు, జీవాలకు జీవనాధారమై చెరువులు, కుంటలు ద్వంసమయ్యాయి. క్రషర్ల యాజమాన్యాలు క్రషర్ల నుంచి వచ్చే కాలుస్యాన్ని చెరువులు, కుంటల్లో వదలడం వల్ల పూర్తిగా విషపూరితంగా మారినట్లు గుర్తించారు.
ఎవ్వరినీ వదిలిపెట్టం.. మంత్రి సీరియస్ గా ఉన్నారు.. : ఆర్డీఓ రవీందర్ రెడ్డి
అక్రమ మైనింగ్ క్రషర్లపై మంత్రి దామోదర్ సీరియస్ గా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్లపై చర్యలు తీసుకుంటాం. ఎవ్వరిని వదిలి పెట్టం. ఎంతవారైనా ఉపేక్షించబోం. కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ లక్షారం, జిన్నారంలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్రషర్లను పూర్తిగా తనిఖీలు నిర్వహి స్తుంది. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ తనీఖీల్లో క్రషర్లు ఏర్పాటు చేసిన భూమి ప్రభుత్వ భూమిగా, అసైన్డ్ భూమిగా, పట్టా భూమిగా గుర్తిస్తాం. క్రషర్లకు ప్రభుత్వ భూములు కేటాయిస్తే ఏ సర్వేనంబర్, ఎంత భూమి కేటాయించాం. అందులో ఇంకా మిగిలిన భూమి ఎంత, అసైన్డ్ భూమి అయితే ఎంత ఇచ్చారు. ఏ విధంగా పొందారు అనే వివరాలు సేకరిస్తాం. ఇక్కడ క్రషర్లు తీసుకున్న భూమి కొంత, అనుమతి తీసుకున్న భూమి కాకుండా అదనంగా ఏర్పాటు చేశారు. విలువైన చెరువులు, కుంటలు ఆక్రమించుకున్నట్లు గుర్తించాం. ఇరిగేషన్ లెక్కల ప్రకారం 881 యూనిట్లు ఖబ్జాకు గురైనట్లు గుర్తించడం జరిగింది. కంపెనీల సందర్భంగా ఎన్.ఓసీ తీసుకున్నారా లేదా అనే అంశాలు తెలుసుకుంటున్నాం. అక్రమంగా ఏర్పాటు చేసిన మైనింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి చర్యలు తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటిని అధ్యయనం చేసి 10 రోజుల్లో కలెక్టర్ కు నివేదిక అందజేస్తాం. ఈ తనిఖీల్లో పటాన్ చెరు డీఎస్పీ పురుశోత్తం రెడ్డి, పీసీబీ ఈఈ గీతా సఫరే, ఇరిగేషన్ ఈ ఈ మధుసూదన్ రెడ్డి, కార్మికశాఖ అధికారులు, రెడెన్యూ, పోలీసు అధి కారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి భాగోతం బట్టబయలు..
లకుడారంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి సర్వే నం 738 లో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ సప్లయర్స్ మైనింగ్ పై అధికారులు చేసిన తనిఖీల్లో ఎన్నో అక్రమాలు బయట పడ్డాయి. 4.23 హెక్టార్లలో నడవాల్సిన మైనింగ్ 15 ఎకరాల వరకు జరిగి ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా అక్రమంగా మైనింగ్ నడుపుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ముఖ్యంగా అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా మైనింగ్ కు పాల్పడ్డట్టు వెలుగు చూసింది. అదే విధంగా నీటి వనరులను పూర్తిగా ద్వంసం చేశారు. క్రషర్లు నడిపే యజమానులు బీఆర్ఎస్ కు చెందిన వారే ఉండడం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కనీస నిబంధనలు పాటించలేదు. క్రషర్ల యాజమాన్యాలు పక్కనే ఉన్న గ్రామానికి నష్టం కలిగించే విధంగా పగలే బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారు. మైనింగ్ కంపెనీ యాజమాన్యం బ్లాస్టింగ్ లు చేయాలంటే శిక్షణ తీసుకున్నవారు ఉండాలి. కానీ చిన్నపిల్లలతో బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కషర్ల నుంచి వచ్చే కాలుష్య జలాలు పూర్తిగా చెరువుల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రోడ్డుపై దుమ్ము లేస్తుంటే నీళ్ల పిచాకార్ చేయాలి. కానీ ఆ విధంగా చేసిన దాఖలు కనిపించలేదని ఆర్డీఓ తెలిపారు.(సోర్స్: దిశ)